*వైస్సార్సీపీ సర్పంచ్ ల ప్రెస్ మీట్*
*మా పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది అందుకే మాకు త్వరగా బయల్ మంజూరు చేసి న్యాయం జరిగింది …..*
*వైవీర్ గారి కార్యాలయం 03/05/2026*
గుంతకల్ మండలంలోని
5 గ్రామాల YSR కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచులు పై అక్రమ కేసు నమోదు…
అనంతపురం జిల్లా గుంతకల్ మండలం లోని ఐదు గ్రామాలు నెలగొండ ,చింతలాంపల్లి, నల్లదాసరపల్లి, పాతకొత్త చెరువు, ఇమాంపురంగ్రామాల సర్పంచ్ల పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన విషయం అందరికీ తెలిసిందే న్యాయస్థానంపై నమ్మకంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా త్వరగా బెయిల్ మంజూరు చేసింది బెయిల్ పై వచ్చినవారు రోజు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారికి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోగా అనేకసార్లు ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాకు బిల్లులు మంజూరు చేయించండి అని తెలియజేసినా కూడా రాజకీయ వత్తులతో ఏ ఒక్క అధికారి కూడా మాకు బిల్లులు చెల్లించకపోగా మమ్ములను చాలా ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని వారు తెలియజేశారు గ్రామంలో అత్యవసరమైన నీటి సమస్య, లైటింగ్ సమస్య ,డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య లపై ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని ఇదే విషయాన్ని ఉన్నంత అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని దిక్కూతోచిన స్థితిలో మాకు పనిచేసిన వారి నుండి బిల్లులు చెల్లించండి అని తీవ్రమైన ఒత్తిడి రావడంతో చెక్కల ద్వారా మాకు (సర్పంచ్ ) ఉన్న చెక్ పవర్ ని ఉపయోగించి బిల్లులు మంజూరు చేశామని అంతేగాని ఎక్కడ కూడా మేము అవినీతికి అక్రమాలకు పాలపడలేదని తెలియజేశారు మాకు వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానంలో నివేదికలు సమర్పించి కోర్టు ద్వారా మాపై అక్రమ కేసులు పెట్టిన అధికారులకు బుద్ధి చెబుతామని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో నెలగొండ గ్రామం మాజీ సర్పంచ్ పాటిల్ భాగ్యమ్మ, చింతలంపల్లి మాజీ సర్పంచ్ పద్మావతి, నల్ల దాసులపల్లి సర్పంచ్ ఎర్రలింగమ్మ, పాత కొత్త చెరువు మాజీ సర్పంచ్ మల్లికార్జున, ఈమాంపురం సర్పంచ్ రంగన్న పాల్గొన్నారు.
