విశాఖ.
చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టుల ఆందోళన*
చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. హత్య ఘటనను ఖండిస్తూ, జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి కి వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పి. నారాయణ, జి. శ్రీనివాసరావు, బి. శివప్రసాద్, కృష్ణమూర్తినాయుడు, కిషోర్, కర్రి సీతారాం, బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె. మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నాయకులు జగన్మోహన్, కె.వి. శర్మతో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.
