Latest Posts

దారితోటలో యువకుడిపై దాడి – భుజానికి తీవ్ర గాయం

తాడిమర్రి (yes9 tv)

తాడిమర్రి మండలంలోని దారితోట గ్రామంలో శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. దారితోట ఎస్సీ కాలనీకి చెందిన కుళ్లాయప్ప కుమారుడు బద్రిపై అదే గ్రామానికి చెందిన శశిబూషన్ రెడ్డి కొడవలి విసిరిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో బద్రికి భుజంపై తీవ్రమైన గాయం అయ్యింది.
బద్రి పదో తరగతి వరకు చదువుకుని కుటుంబ పోషణ కోసం అరటికాయలు మోయడం వంటి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో అతను కూలీ డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై కృష్ణవేణి యాదవ్ తెలిపారు.

Posted Under AP
Editor