పెన్నహోబిలం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 01-05-2026 న సాయంత్రం శేషవాహనం సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
శేషవాహనంపై స్వామివారిని అలంకరించి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉభయ దారులు శ్రీ యం.సుదర్శనం గారు, కుటుంబ సభ్యులు, ముదిగుబ్బ గ్రామం వారు దేవస్థానం అర్చకులు, సిబ్బంది, పోలిష్ సిబ్బంది,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెన్నహోబిలంలో వైభవంగా శేషవాహన సేవ: భక్తజన సందోహం మధ్య మాడ వీధుల్లో విహరించిన లక్ష్మీనరసింహుడు
