అనంతపురం జిల్లా, రాయదుర్గం.
* పండుగ వాతావరణంలో సాంఘిక సంక్షేమ పెన్షన్లు పంపిణీ
ప్రతినెల పండుగ వాతావరణం లో పేదల సేవల పేరుతో సాంఘిక సంక్షేమ పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా కనేకల్ మండలం కలేకుర్తి గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలవ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, వార్డులలో పేదల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 22 నెలల్లో రూ. 63,158 కోట్లు పెన్షన్లు అందజేశామన్నారు. నిరుపేదలకు ఇది ఒక గొప్ప భరోసా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా పేదలను ఆదుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవన్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతినెల 37, 050 మందికి పెన్షన్లు రూపంగా రూ. 16.05 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాయదుర్గం నియోజకవర్గంలో రూ. 352 కోట్లు పెన్షన్ రూపంగా ఇచ్చామన్నారు. ఈ నెల నుంచి కొత్తగా మంజూరైన పెన్షన్లు అందించడంతో పేదల కు ఎంతో భరోసా ఇస్తున్న నాయకుడు చంద్రబాబు అని కూటమి ప్రభుత్వంలో పేదలను ఆదుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్న చంద్రబాబు నాయుడుకి ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, మరో 15 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కాలవ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
