Latest Posts

ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే అడ్డుకుంటాం – ఏఐఎస్ఎఫ్…

*ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే అడ్డుకుంటాం – ఏఐఎస్ఎఫ్*

*ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి*

*ముందస్తు అడ్మిషన్లు అరికట్టడంలో విద్యాశాఖ అధికారుల వైపల్యం*

*ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు*

ఉరవకొండ:: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉరవకొండ పట్టణం లోని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే అన్ని గ్రామాలలో గడప గడపకు తిరుగుతూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఆయా పాఠశాలల యొక్క అడ్మిషన్ల పాంప్లెట్లను పంచుతూ పబ్లిసిటీ చేసుకుంటూ పేద ప్రజల దగ్గరికి వెళ్లి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ముందస్తు అడ్మిషన్ల ప్రచారానికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోని ఆయా పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. .ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కోశాధికారి రాజు, ఉపాధ్యక్షులు రఘు ,లాలు స్వామి, సహాయ కార్యదర్శి సాగర్ నాయకులు వంశీ, రాజు, శివకృష్ణ, శాంతికుమార్, షమీర్, తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు*.

Posted Under AP
Editor