Latest Posts

రాహుల్ గాంధీకి.. మందకృష్ణ లేఖ.. ఎందుకంటే..

ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానం మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎస్సీ స్థానాలైన పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ స్థానాల్లో కూడా మాదిగలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పార్లమెంట్లో మాదిగలకు ప్రాతినిధ్యం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానమైనా మాదిగలకు అవకాశం కల్పించాలని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు..

YES9 TV