Latest Posts

ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

ఏపీలో పెట్టుబడులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేధికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదంపై లోకేష్ స్పందించారు. కర్ణాటకలో కొత్త చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ మ్యాన్స్, నాస్కాం వంటి ఆర్గనైజేషన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని లోకేష్ తెలిపారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కర్ణాటక చట్టంపై చర్చ మొదలైన నేపథ్యంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

 

నాస్కాం ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ ఏపీలో పెట్టుబడులపై లోకేష్ ట్వీట్ చేసారు. ఇన్వెస్టర్ల ఆవేదన , అభ్యంతరాలు తాను అర్థం చేసుకుంటానని అన్నారు. ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టొచ్చంటూ ఓపెన్ ఇపర్ ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, డాటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి రంగాల్లో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టదని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహాకారం ఉంటుందని అన్నారు.

 

ఉత్తమ పాలసీలు, మౌళిక సదుపాయాలు, నిరంతర విద్యుత్‌తో పెట్టుబడులకు అనుకూలత వాతావరణం కల్పిస్తామని లోకేష్ అన్నారు. నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని పెట్టుడులు పెట్టాలని నారా లోకేష్ పేర్కొన్నారు.

Posted Under AP
Editor