అపద్దాలకు కేరాఫ్ అడ్రస్ మోదీ, ఫ్లాష్ బ్యాక్ చెప్పిన సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలా !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద అబద్దాలకోరు అని సిద్దరామయ్య ఆయన పాత రోజుల గురించి చెప్పారు.

మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ, సంఘ్ పరివార్‌లు ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

దేశంలోని ప్రతి మూలకు వెళ్లి వారి బీజేపీ కుతంత్రాలను బట్టబయలు చేసి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సీఎం సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు. బీజేపీ వల్ల రాజ్యాంగానికి, దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని సీఎం సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రధాని నరేంద్ర మోదీలా అబద్ధాలు చెప్పే ప్రధానిని తాను చూడలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

రాహుల్ గాంధీ భారత్ లో బ్యాచిలర్, సార్ కు విదేశాల్లో భార్య, పిల్లలు, గాలి రెడ్డి బ్రదర్ !

ప్రధాని నరేంద్ర మోదీ అంటేనే మాయ అని సిద్దరామయ్య ఆరోపించారు. 2014లో ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని, రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అచ్ఛే దిన్‌ (మంచి రోజులు) తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీలు ఇచ్చారని, ఆ హామీలు అన్ని ఏమైనాయని సీఎం సిద్దరామయ్య ప్రధాని మోదీని, బీజేపీ నాయకులను ప్రశ్నించారు. అచ్ఛే దిన్ కా క్యా హువా? అని సిద్ధరామయ్య బీజేపీ నాయకులను వ్యంగంగా ప్రశ్నించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను, డీకే శివకుమార్ రాష్ట్రంలోని ప్రతి గడపకూ తిరుగుతూ బీజేపీ దుర్మార్గాన్ని, వారు చేసిన అవినీతిని ప్రజలకు వివరించామని, అందువలనే అత్యధిక సీట్లు గెలుచుకున్నామని, కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేశామని సీఎం సిద్దరామయ్య చెప్పారు.

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది పునరావృతం కావాలని, బీజేపీ అవినీతి పాలనపై ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు.

భార్య అక్రమ సంబంధం, చికెన్ కర్రీ, బిర్యానీ డిన్నర్ స్కెచ్ తో హత్య, ముందు జాగ్రత్త !

 

మతం, ప్రాంతం, కులం, భాషల ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు బీజేపీ, సంఘ్‌పరివార్‌ ప్రయత్నిస్తున్నాయని, ద్వేషపూరిత రాజకీయాలు, కమీషన్‌ రాజకీయాలు పని చేయవనే విషయాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకకు ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధరకు బియ్యం సరఫరా చెయ్యడం లేదని సిద్దరామయ్య ఆరోపించారు.

YES9 TV