భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న 2వ వన్డేకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. బొటన వేలికి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గాయంతో బంగ్లాతో మూడో వన్డే, మెుదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు రెండో టెస్టులోనూ ఆడటం లేదు. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. ఎడ్జ్ తాకి.. తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ బొటనవేలికి తాకింది. దీంతో బొటనవేలి నుంచి రక్తం వచ్చింది. ఆసుపత్రికి వెళ్లాడు. దెబ్బ గట్టిగానే తగిలినా.. టీమ్ ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు వచ్చి.. బ్యాటింగ్ చేశాడు. దీంతో గాయం ఎక్కువైనట్టుగా తెలుస్తోంది. రోహిత్ దూరమవ్వడంతో కేఎల్ రాహుల్(KL Rahul) టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. బొటనవేలి గాయం నుంచి ఇంకా కోలుకుంటున్న రోహిత్ రిస్క్ చేయకూడదని బీసీసీఐ(BCCI) నిర్ణయించింది.
రెండో టెస్టులో ఆడించకూడదని అనుకుంటోంది. స్పెషలిస్ట్‌ని సంప్రదించి.. 2వ వన్డే తర్వాత ముంబైకి తిరిగి వెళ్లాడు రోహిత్. టెస్టులో రోహిత్ మైదానంలోకి దిగితే గాయం మరింత పెద్దది అయ్యే ప్రమాదం ఉందని భయాలు ఉన్నాయి. టెస్టు సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రోహిత్ స్థానంలో యువబ్యాటర్ అభిమాన్యు ఈశ్వరన్ ను తీసుకొచ్చారు. తొలి టెస్టులో సెంచరీ సాధించిన శుభ్ మన్ గిల్ కు రెండో టెస్టులోనూ అవకాశం లభిస్తుంది. రోహిత్ కు పూర్తిస్థాయిలో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ(BCCI) అనుకుంటోంది. రిస్క్ చేసి.. సమస్యను పెద్దదిగా చేయోద్దని నిర్ణయించింది. జనవరి మొదటి వారంలో శ్రీలంక(Sri Lanka)తో జరిగే సిరీస్‌లో పాల్గొనడానికి రోహిత్ సిద్ధంగా ఉంటాడని తెలుస్తోంది. జనవరి 3 నుంచి సిరీస్ ప్రారంభమవుతుంది. IND vs BAN 1st Test: తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 188 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమ్ ఇండియా నిలిచింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
