Latest Posts

YCP ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

YSRCP Twitter Hacked: ఏపీలో అధికార వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాకర్ చేశారు. వైఎస్సార్సీపీ పేరు మారు పేరు పెట్టారు. మొదట NFT Millionarie పేరుతో ట్విట్టర్ ఖాతాను మార్చేయగా.. మళ్లీ YSR Congress Party గా మార్చారు. లోకేషన్ యూఎస్‌ఏ ఉన్నట్లు చూపిస్తోంది. ట్విట్టర్ కింద మాత్రం NFT MILLIONARIE అలానే ఉంది. హ్యాకర్లు రాత్రి నుంచి పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తుండడంతో నెటిజన్లకు అర్థం కాలేదు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఐటీ విభాగం ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్రోల్స్ మొదలు పెట్టేశారు.

వైసీపీకి సంబంధించి ప్రొఫైల్ పిక్, కవర్ ఫొటో, బయోడేటాను మార్చేశారు హ్యాకర్లు. క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. ఇప్పటికే ట్విట్టర్ యాజమాన్యానికి వైఎస్సార్సీపీ ఐటీ విభాగం సిబ్బంది కంప్లైంట్ చేశారు. ఇందుకు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రెండు నెలల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు టైలర్‌ హాబ్స్‌ పేరుతో టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు మార్చారు. అప్పుడు టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌ పోస్టులు కనిపించాయి. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ ఐటీ వింగ్.. ట్విట్టర్ యాజమాన్యాన్ని సంప్రదించి మళ్లీ అకౌంట్‌ను రికవరీ చేసింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Posted Under AP
Editor