Latest Posts

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి

అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)గా పనిచేశాడు . 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. వివరాల్లోకి వెళ్తే.. గోవాలో ప్రారంభమైన ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు

. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి స్పందించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి వివరించారు. అంతకుముందు, చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022గా ప్రకటిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదరణ పొందారని, హృదయాలను కదిలించే నటనా ప్రతిభ ఆయన సొంతమని కొనియాడారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు.

Editor