రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్‌ స్టంట్స్‌, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు

08-08-2026న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముదిగుబ్బ పోలీసులు అక్కడికి చేరుకుని మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్‌, బిల్లే ఆకాష్‌, డేరంగుల దినేష్‌, దేవర రామ మోహన్‌, భోగరాతి సాయికుమార్‌, మేకల వంశీ, సంగాల ప్రసాద్‌ మరియు మట్ట మల్లికార్జున రెడ్డిలను గుర్తించి, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి అక్కడి నుండి పంపించారు.
ఈ ఘటనపై 09-08-2026న ప్రత్యేక నివేదిక అందగా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. రోడ్లపై అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి. శివరాముడు గారు హెచ్చరించారు.
ప్రజలు పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
Posted Under AP
Editor