ముదిగుబ్బ మండలం కొండగట్టుపల్లి పంచాయతీ, పైపేడు నీటి సమస్యకు శాశ్విత పరిస్కారం

ముదిగుబ్బ yes9TV
పరిటాల శ్రీరామ్ గారి సూచనల మేరకు కొండగట్టుపల్లి పంచాయతీ పరిధిలోని పైపేడు గ్రామంలో చాలా కాలంగా ఉన్న నీటి ఎత్తిపోతల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.గ్రామానికి అవసరమైన చెరువు కట్ట నిర్మాణాన్ని RDT సంస్థ సహకారంతో చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చెరువు కట్ట నిర్మాణం పూర్తయితే వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాలు మెరుగుపడటంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం కలుగనుంది. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ తుమ్మల మనోహర్, పేవేడు శ్రీనివాసులు, డీలర్ కిష్ణయ్య,నారాయణ స్వామి, దాలమిల్ సోము, కార్తీక్, ఐటీడీపి గురు, స్టూడియో అశోక్,ఇతర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు…

Posted Under AP
Editor