ఘనంగా అమరావతి ఛాంపియన్షిప్–2026 ఎంపిక పోటీలు.. ఆలూరులో క్రీడాకారుల జాతర!

అమరావతి ఛాంపియన్షిప్–2026 ఆలూరు నియోజకవర్గ స్థాయి అండర్–17, అండర్–23 బాలుర ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది
అమరావతి ఛాంపియన్షిప్–2026లో భాగంగా ఆలూరు నియోజకవర్గ స్థాయి అండర్–17, అండర్–23 బాలుర ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎంపిక పోటీల్లో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 600 నుంచి 800 మంది యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి, నంబర్–2 ప్రిన్సిపల్ ప్రశాంతి మేడం హాజరై క్రీడాకారులను అభినందించారు. అలాగే కేవీకే స్టేడియం వాలీబాల్ కోచ్ ధనుంజయ్, కోఆర్డినేటర్ వీరేష్, చిన్నబాబు, పీడీలు రజియా భాను మరియు ఇతర క్రీడా ఉపాధ్యాయులు, నిర్వాహకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇటువంటి ఎంపిక పోటీలు మంచి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ఆలూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక బృందాన్ని ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. పోటీల నిర్వహణలో సహకరించిన పీడీలు, కోచ్‌లు, ఉపాధ్యాయులు, వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగియడంతో పాల్గొన్న క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మరియు క్రీడా ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor