క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి…

  • క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి…
  • క్రీడాపోటీలనుప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

 

అనంతపురం, జూలై 29: గ్రామీణ ప్రాంతాల్లోదాగిఉన్న క్రీడాప్రతిభనువెలికితీసి
రాష్ట్ర, జాతీయ అంతర్జా
తీయ స్థాయిలో రాణించే
విధంగాక్రీడాకారులను
తీర్చిది ద్దాలన్నదే ప్రభుత్వ
లక్ష్యమని,ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నక్రీడాఅవకాశాలను సద్వినియోగం చేసు కోవాలని జిల్లా కలెక్టర్
ఓ. ఆనంద్ తెలిపారు. బుధవారం ఉదయం అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు జడ్పీ హైస్కూల్ లో అనంతపురం రూరల్ మండలం స్థాయి బాల బాలికలకు అమరావతి ఛాంపియన్షిప్- 2026 క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్
ఓ. ఆనంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసినసమావేశంలోపాల్గొన్న జిల్లా కలెక్టర్ తొలుత క్రీడల్లో పాల్గొన్న బాల బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూముఖ్యంగా ప్రభుత్వంగ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్నిపెంపొందించాలన్న ధ్యేయంతో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వ హిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలలో జిల్లా వ్యాప్తంగా ఎంతోఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. బాల బాలికలు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తద్వారా ప్రతిభకు కొదవ ఉండదని ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న అవకాశాలు, శిక్షణ ప్రోత్సాహంనుఉపయోగించుకోవాలన్నారు.
ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే బాల బాలికలు ఆయా క్రీడల్లోమంచిప్రతిభపటవాలు ప్రదర్శించి జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించి ఆయా పాఠశా లలకు, జిల్లాకు మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా కృషి చేయాలి అన్నారు. క్రీడల్లోనూ రాణించడం ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెరుగు
తుందన్నారు. క్రమశిక్షణ తో విద్యాభ్యాసం పూర్తి చేసి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహిం
చాలని జిల్లా కలెక్టర్ సూచిం చారు. క్రీడాకారుల తోపాటు క్రీడాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అనంతపురంమండలంలోని 12 పాఠశాలల నుంచి బాల బాలికలు 500 మంది దాకా రెండు రోజులు పాటు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ వారి ప్రోత్సాహంతో ప్రస్తుత జడ్పీ హైస్కూల్ లో ఉన్న ప్లే ఫీల్డ్ మైదానాన్ని అన్ని విధాల తీర్చిదిద్దడం జరిగిందని జిల్లా విద్యాశాఖ ఆర్డిటి మరియుజిల్లాక్రీడాఅభివృద్ధి సంస్థలసంయుక్తసౌజన్యంతో ఈ అనంతపురం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించ బడుతున్నాయని రెండు రోజులు పాటు రూరల్ క్రీడా పోటీలు జరగనున్నట్లు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మండల స్థాయిలో నిర్వహించబ డుతున్న అండర్ -14 బాలురు మరియు బాలికల విభాగంలో వాలీబాల్, కబడ్డీ ,కోకో, అథ్లెటిక్స్ పోటీల వివరాలను జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి ద్వారా అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
వాలీబాల్ క్రీడ ను ప్రారం భించి బాల బాలికలను ఎంత ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ ను కలిసి తమ పాఠశాలను అన్ని విధాల తీర్చిదిద్దాలని అలాగే వ్యవసాయ పంటల రైతులకు వర్షపు నీటిని అందించే విధంగా జలధార కార్యక్రమం ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పై తెలిపిన అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మంజుల, ఎంపీడీవో దివాకర్ , ఆర్ ఐ సందీప్, సింగల్ విండో అధ్యక్షులు లక్ష్మీనారాయణ, హెడ్మాస్టర్ విశ్వనాధ్ , ఆర్డిటి స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి పలువురు గ్రామ పెద్దలు నాయకులు పాఠశాలల ఉపాధ్యా యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor