ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి జిల్లా
మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులకు జరిమానా
ముదిగుబ్బ yes9TV
శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీ S. సతీష్ కుమార్ IPS గారి గారి ఆదేశాల మేరకు, ముదిగుబ్బ U/G పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి. శివరాముడు గారు రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ మరియు ట్రాఫిక్ నిబంధనల అమలు కొరకు ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగినది.
ఈ తనిఖీలలో క్రింది ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినారు.
1. నసీర్ హుస్సేన్, వయస్సు 34,అజ్జన్నగారి శశిధర్, వయస్సు 35 సంవత్సరాలు, వీరిపై ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో చట్టపరమైన కేసులు నమోదు చేసి గౌరవనీయులైన ద్వితీయ తరగతి న్యాయ మేజిస్ట్రేట్, కదిరి వారి ఎదుట హాజరుపరచగా, గౌరవ కోర్టు వారు ముగ్గురినీ దోషులుగా నిర్ధారించి ప్రతి *ఒక్కరికి రూ.10,000/- చొప్పున మొత్తం రూ.30,000/- జరిమానా విధించడం జరిగినది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వలన తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు సంభవించి అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. శివరాముడు గారు ప్రజలకు హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే జరిమానాలు, కోర్టు శిక్షలతో పాటు చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు వంటి చర్యలు కూడా తీసుకోబడే అవకాశమున్నదని తెలిపారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, మద్యం సేవించి వాహనాలు నడపకుండా పోలీసు శాఖకు సహకరించి రోడ్డు భద్రతకు తోడ్పడవలసిందిగా కోరడమైనది.
జి. శివరాముడు
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ముదిగుబ్బ U/G పోలీస్ స్టేషన్
శ్రీ సత్యసాయి జిల్లా.
