అనంతపురం జిల్లా -కళ్యాణదుర్గం
రెండవ రోజు గ్రామీణ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు గ్రామంలో విద్యార్థులను విద్యకు ప్రాధాన్యత ఇచ్చేలా వారికి మరింత ప్రోత్సాహం అందించడం కోసం గ్రామీణ ప్రాంత విద్యార్థులు 9,10, ఇంటర్ విద్యార్థులకు కానుకగా సైకిళ్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.
ముదిగల్లు గ్రామంలో ఇంటింటికి టీడీపీలో భాగంగా ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి అభివృద్ధి, సంక్షేమ గురించి తెలుకుని, వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని ముదిగల్లు గ్రామంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు టీడీపీ సీనియర్ నాయకులు స్థానిక నాయకులతో కలసి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొనగ నాయకులు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.
రెండవ రోజు గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహక కానుకగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అందిస్తున్న సైకిళ్ల పంపిణీ మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించగా
టీడీపీ సీనియర్ నాయకులు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో కలసితో కలసి పాల్గొని సైకిళ్లు విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు..
