శ్రీ సత్యసాయి జిల్లా కదిరి
మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (Mega PTM 4.0)కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారికి కూటమి ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు అయినా “తల్లికి వందనం “అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వంపై సమానంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన బోధన అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తోందని, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” ” సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కార్యక్రమం” వంటి పథకాల ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తోందని వివరించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ‘అమ్మవడి’ పథకంలో వేలాది కుటుంబాలను నిరాశపరిచిన వైఎస్సార్‌సీపీకి విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే విమర్శించారు. హామీలు ఇచ్చి మరచిపోయే పాలనకు, హామీలు అమలు చేసే పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారని* తెలిపారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన నాణ్యతమైన విద్య నేడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ కనిపిస్తోందని, విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని మరింత పెంచుతున్నారని తెలిపారు.
బైట్స్..
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
