పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. డి.హీరేహాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ‘లీప్’ యాప్, ‘తల్లికి వందనం’ వంటి పథకాల ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. డి.హీరేహాల్ పాఠశాలను స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీగా అభివృద్ధి చేసి, జూనియర్ కళాశాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
