రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణకు సంబంధించిన *జీవో ఎంఎస్ నెం.396* ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి *మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు* వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో *మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు యం. మధుబాబు*, జిల్లా చేనేత హస్తకళ విభాగపు అధ్యక్షులు *చేనేత మల్లి*, మండల బీసీ సెల్ కార్యదర్శి *తిమ్మాపురం వాల్మీకి బజారప్ప*, తిమ్మాపురం వైఎస్సార్సీపీ నాయకులు *మాజీ విద్య కమిటీ చైర్మన్ వాల్మీకి వీరాంజనేయులు*, వైఎస్ఆర్‌ఎస్‌యూ వింగ్ జిల్లా సెక్రటరీ *సోమశేఖర్* తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు *యం. మధుబాబు* మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రభుత్వ సేవలను క్రమంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) మోడల్ కింద ప్రైవేటీకరించే ప్రయత్నం చేసి, పూర్తి చేయాల్సిన పలు మెడికల్ కాలేజీల పనులను నిలిచిపోయే పరిస్థితికి తీసుకువచ్చిందని అన్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.
ఇప్పుడు అదే విధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని ప్రింటింగ్ సేవలు మరియు సంబంధిత కార్యకలాపాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది *దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, స్టాంప్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు* జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ఎన్నో సంవత్సరాలుగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే *జీవో ఎంఎస్ నెం.396ను ఉపసంహరించుకొని, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకోవాలని* ఆయన డిమాండ్ చేశారు.
లేని పక్షంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
