విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కప్పట్రాల్లా బొజ్జమ్మ గారు, వారి భర్త శ్రీ రామచంద్ర నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తల పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వివరించారు.
ఆలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాము.
#Alur #TeluguDesamParty #TDP #NaraChandrababuNaidu #AndhraPradesh #Development #ValmikiCorporation #KappatrallaBojjamma #RamachandraNaidu #AlurDevelopment
