Latest Posts

పరిటాల శ్రీరామ్ చొరవతో 72 గంటల్లోనే రైతులకు పరిహార చెక్కుల పంపిణీ..

పరిటాల శ్రీరామ్ చొరవతో 72 గంటల్లోనే రైతులకు పరిహార చెక్కుల పంపిణీ..
ముదిగుబ్బ yes9 Tv
సానేవారిపల్లి: ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ పరిటాల శ్రీరామ్ గారి చొరవతో, ఇటీవల రైతులు–విద్యుత్ శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు 72 గంటల్లోనే రైతులకు పరిహార చెక్కులు పంపిణీ చేశారు.హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణం వల్ల ప్రభావితమైన రైతులకు న్యాయం జరిగేలా శనివారం జరిగిన సమావేశంలో పరిటాల శ్రీరామ్ గారు అధికారులతో చర్చించి, పరిహారాన్ని ఆలస్యం చేయకుండా త్వరితగతిన అందజేయాలని కోరారు. ఆయన చొరవతో ఇచ్చిన హామీ మేరకు నేడు సంబంధిత రైతులకు పరిహార చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తమ సమస్యను వెంటనే పరిష్కరించి, ఇచ్చిన హామీ ప్రకారం 72 గంటల్లోనే పరిహారం అందేలా కృషి చేసిన శ్రీ పరిటాల శ్రీరామ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు.
ఈ సందర్భంగా డి. లక్ష్మీనారాయణమ్మ, రంగారెడ్డి, బొజ్జ రామకృష్ణ అనే ముగ్గురు రైతులకు పరిహార చెక్కులు పంపిణీ చేశారు.
టవర్ నెం. 64కు సంబంధించిన భూ యజమాని శ్రీ శివారెడ్డి, టవర్ నెంబర్లు 65, 66కు సంబంధించిన భూ యజమానులు డి. లక్ష్మీనారాయణమ్మ మరియు బొజ్జ రామకృష్ణలకు సంబంధించిన పరిహార చెక్కులను ఈ సందర్భంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మల మనోహర్, మండల ప్రధాన కార్యదర్శి నరసింహులు, బండి మల్లికార్జున, గుత్తా కార్తీక్ నాయుడు, మదాసు గంగాధర్, గుర్రంకొండ బాబ్జాన్ తదితర తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor