*ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన*
*శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రా, గుంతకల్లు మం ” అనంతపురం జిల్లా.*
ఈరోజు తేదీ 18.07.2026 (yes9 news)శనివారము ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారి ఆధ్వర్యంలో ఆలయ ముందు భాగంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఓమినీ హాస్పిటల్ కర్నూల్ వారు ఆలయ యావన్మంది సిబ్బందికి, భక్తులకు, గ్రామ ప్రజలకు సుమారుగా 700 మందికి ఉచిత వైద్య పరీక్షలు బిపి , షుగర్, పల్స్ గుండెకు సంబంధించి ఈసీజీ , టుడే ఈకో , పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారు , కర్నూలు ఓమినీ హాస్పిటల్ డాక్టర్ ఇందు ప్రకాష్ రెడ్డి ( కార్డియాలజిస్ట్ ) గారు, డాక్టర్ శిశిర (జనరల్ మెడిసిన్ ) గారు, డాక్టర్ సుదీప గారు, డాక్టర్ శ్రీజ గారు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి యస్. హరి ప్రసాద్ యాదవ్ గారు , సహాయ కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకులు , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
