ముదిగుబ్బ yes9 Tv
వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలని మండల ప్రత్యేక అధికారి శ్రీ జనార్దన్ రావు సూచించారు. శనివారం యాకర్లకుంటపల్లి గ్రామంలో రైతులకు ఆరుతడి పంటలు మరియు పిఎండిఎస్ పై వ్యవసాయ అధికారులు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా,ప్రతి రైతూ తాను వేసే పంట విత్తనాలను విత్తన గుళికలు చేసుకొని వర్షం కోసం ఎదురు చూడకుండా వెంటనే పొలంలో విత్తుకోవాలని తెలిపారు.. కొద్దిపాటి వర్షం వచ్చిన వెంటనే విత్తనం ఆరోగ్యంగా మొలకెత్తుతుందన్నారు.ప్రధాన పంట తో బాటు, ఇతర పంటల విత్తనాలు కూడా విత్తన గుళికలు చేసుకొని పంటల సాగు చేపట్టాలని తెలిపారు.వరి పంట బదులు అరుతడి పంటలు సాగుచేయాలని సూచించారు.రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం చేపట్టాలని తెలిపారు. కార్యక్రమం లో మండల అభివృద్ధి అధికారి హాజీవలి సాహెబ్, వ్యవసాయ అధికారి రవీంద్ర, ప్రకృతి వ్యవసాయ విభాగం మండల కో ఆర్డినేటర్ పెద్దన్న, FMT కృష్ణ వేణి, వ్యవసాయ సిబ్బంది అంజిబాబు, ప్రియాంక, నాగరాజు,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయం శ్రేయస్కరం..
