అనంతపురం విజయోత్సవ సభకు రాయదుర్గం నుండి భారీగా తరలిన కూటమి శ్రేణులు!

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన నమ్మకం, సంక్షేమం – అభివృద్ధి కార్యక్రమాల విజయాలను ప్రజలకు వివరించేందుకు అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు రాయదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు గారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా బయలుదేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
రాయదుర్గం నియోజకవర్గం నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గారు అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి కుటుంబానికి వివరించాలని పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor