కర్నూలు జిల్లా:
ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తీవ్ర విమర్శలు చేసిన వైకుంఠం జ్యోతి.
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతోందని వ్యాఖ్య.
ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఎవరో చెప్పాలని ప్రశ్న.
పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచినందుకు వెన్నుపోటు దినోత్సవం జరుపుతున్నారా..? అని ప్రశ్న.
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని ఓర్వలేకపోతున్నారా..? అని వ్యాఖ్య.
తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడి.
ఆలూరు నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసినందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారా..? అని ప్రశ్న.
వేదవతి ప్రాజెక్టుకు త్వరలో నిధులు మంజూరై పనులు పూర్తి దశకు చేరనున్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు క్షమాపణ చెప్పి వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే విరూపాక్షిపైనే ఉందని వైకుంఠం జ్యోతి వ్యాఖ్యానించారు.
ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం….
