Latest Posts

పిన్నదరి గ్రామానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం……..

తాడిమర్రి( yes9tv )పిన్నదరి గ్రామానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
రూ.3 లక్షల వ్యయంతో నూతన నీటి బోరు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
తాడిమర్రి, జూన్ 7: ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం పినదరి గ్రామ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం (FFC) నిధుల ద్వారా రూ.3 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి బోరును రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
పినదరి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ నూతన నీటి బోరు ద్వారా గ్రామంలోని వందకు పైగా ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న మంత్రి, ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం తమ కర్తవ్యమన్నారు. ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గ్రామ ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor