నలుగురు పత్తి దొంగలను 2 రోజుల్లో పట్టుకున్న బొమ్మనహాల్ పోలీసులు..

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

నలుగురు పత్తి దొంగలను 2 రోజుల్లో పట్టుకున్న బొమ్మనహాల్ పోలీసులు

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామానికి చెందిన రైతు బలిజ హనుమంత రాయుడు వ్యవసాయ తోటలో రూ.50 వేలు విలువైన 5 క్వింటాళ్ల పత్తిని దొంగిలించిన కేసును బొమ్మనహాల్ పోలీసులు రెండు రోజులలో ఛేదించారు.

ఈ కేసు వివరాలను రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకటరమణ, ఎస్సై నబి రసూల్ మీడియా సమావేశంలో ఆదివారం వెల్లడించారు.
పత్తి రైతుకు బొమ్మనహాళ్ పోలీసులు అండగా నిలిచినట్లు తెలిపారు.
పత్తి దొంగతనం కేసులో
నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44,000 నగదు, టాటా ఏస్ వాహనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

రైతు చెమటోడ్చి పండించిన పంట కేవలం ఒక వస్తువు కాదు.. అది ఆ కుటుంబ జీవనాధారం. అన్నదాత కష్టాన్ని దోచుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాధితుడు రైతు అయినప్పుడు పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా స్పందిస్తుందని పోలీసులు నిరూపించారు.
కేవలం 48 గంటల్లోనే దొంగలను పట్టుకుని రికవరీ చేయడం రైతుల పట్ల పోలీసు యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
బాధిత రైతు ఫిర్యాదు మేరకు బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేమకల్లు క్రాస్ వద్ద రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, బొమ్మనహాల్ సబ్ ఇన్స్పెక్టర్ బి. నబీ రసూల్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు.
బొమ్మనహాళ్ మండలం ఉంతకల్ కు చెందిన వన్నూరు స్వామి,
బలిజ నవీన్ కుమార్, అదే మండలం కురువల్లి గ్రామానికి చెందిన బోయ వెలిగొండ నితిన్, కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా, తాలూకా,
రాయపురం కు చెందిన వాల్మీకి హరి లను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు దొంగిలించిన పత్తి పంటను బళ్ళారి కాటన్ మిల్లులో విక్రయించగా వచ్చిన రూ.44,000/- నగదుతో పాటు, నేరానికి ఉపయోగించిన ఒక టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు రికవరీ చేశారు.

విధి నిర్వహణలో పరమార్థం – ఉన్నతాధికారుల అభినందనలు

అన్నదాత కష్టం వృథా పోకుండా, త్వరితగతిన స్పందించి రికవరీ చేసి రైతుకు అందించడం విధి నిర్వహణలో తమకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా పోలీసులు తెలియజేశారు. నిరంతరం ప్రజల రక్షణలో ఉండే పోలీసులకు.. అన్నదాత కళ్ళలో ఆనందం చూడటాన్ని మించిన గౌరవం మరొకటి లేదని పేర్కొన్నారు.

ఈ కేసును రికార్డు సమయంలో ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, బొమ్మనహాల్ ఎస్సై నబి రసూల్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు.

బైట్స్ : 1. వెంకటరమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాయదుర్గం రూరల్, అనంతపురం జిల్లా

Posted Under AP
Editor