ఇంధన పొదుపుపై అవగాహనకు సైకిల్ యాత్ర…..

అనంతపురం జిల్లా,బుక్కరాయసముద్రం

ఇంధన పొదుపుపై అవగాహనకు సైకిల్ యాత్ర

బుక్కరాయసములోని దేవరకొండ నుంచి అనంతపురంలోని గుత్తి రోడ్డు వరకు సైకిల్ తొక్కి ప్రయాణించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం దేవరకొండ నుండి అనంతపురం గుత్తి రోడ్డులోని వాజ్ పేయ్ సర్కిల్ వరకు సైకిల్ తొక్కారు. అధ్యక్షుడు పూల నాగరాజు గారితో పాటు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు గారు, మాజీ జడ్పీటీసీ రామలింగా రెడ్డి గారు,మాజీ గ్రంథాలయ చైర్మన్ జిరాయితీ గౌస్ మోద్దిన్ గారు, మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి గారు సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా పూల నాగరాజు గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే చెట్ల పెంపకం, ఇంధన పొదుపు, కాలుష్య నియ ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సైకిల్ వినియోగం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని ఆయన పూల నాగరాజు గారు పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor