అనంతపురం జిల్లా,తాడిపత్రి పెద్దవడుగూరు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం
పెద్దవడుగూరు, జూన్ 5: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు, ఏపీవో విజయభారతి, సుమంత్ ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు రామాంజనేయులు, జన చైతన్య యువజన సంఘం కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నేడు పర్యావరణాన్ని సంరక్షించుకుంటే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందుతుందని, నిర్లక్ష్యం చేస్తే రానున్న తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతి వనరులను సంరక్షించడం వంటి చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
