ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పెన్సర్ ఏర్పాటు
అనంతపురం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగాq అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో అనంతపురం II REZ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (రెస్సోనియా) ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పరిసర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డిస్పెన్సర్లో వేసి దాని వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) శ్రీ మలోల, పరిపాలనా అధికారి శ్రీ అలెగ్జాండర్ పాల్గొని డిస్పెన్సర్‌ను పరిశీలించారు.
ప్లాస్టిక్ రహిత వాతావరణం ఏర్పాటుకు రెస్సోనియా సంస్థ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించడంలో ఈ తరహా వినూత్న నమూనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వినోద్‌కుమార్, మహేష్, కృతికతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కాగా, భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన జోన్ (REZ) ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లా బొమ్మనహాల్ నుంచి కడప వరకు 765 కేవీ విద్యుత్ ప్రసార లైన్ నిర్మాణ పనులను అనంతపురం II REZ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ చేపడుతోంది.
