మొక్కలు పెంచకపోతే.. భవిష్యత్ లో ప్రమాదం తప్పదు..

అనంతపురం జిల్లా,హెచ్చెల్సీ కాలనీ.

  • మొక్కలు పెంచకపోతే.. భవిష్యత్ లో ప్రమాదం తప్పదు
  • పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి
  • హెచ్చెల్సీ కాలనీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం, జూన్ 05 :

– మొక్కలు పెంచకపోతే..భవిష్యత్ లో చాలా ప్రమాదాల్ని ఎదుర్కొక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో ఎమ్మెల్యే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, అధికారులు, విద్యార్థినీలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నారు. భవిష్యత్ లో ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తల హెచ్చరికలను అంతా గమనించాలన్నారు. అంతే కాకుండా రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం వలన వాతావరణంలో కార్బన్డైయాక్సైడ్ కూడా పెరుగుతోందన్నారు. వీటిని కట్టడి చేయాలంటే మొక్కలు నాటడమే ఏకైక పరిష్కారం అన్నారు. అయితే ప్రతి ఏటా చాలా మంది మొక్కలు నాటుతున్నారని.. అయితే వాటి పరిరక్షణ గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం మొక్కలు నాటి వదిలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కనీసం ఆరు నెలలైనా వాటిని పరిరక్షించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం పెంచే విషయంలో చాలా సీరియస్ గా దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనాభా, వాహనాల వలన కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఇక్కడ మొక్కలు భారీగా నాటి పచ్చదనం పెంచే చర్యలు చేపట్టినట్టు వివరించారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor