Latest Posts

కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య.

 

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని చిల్లగుర్లపల్లిలో కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. నల్లమాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిల్లగొర్లపల్లికి చెందిన శివరామిరెడ్డి (51)గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం శివరామిరెడ్డికి తీవ్ర కడుపునొప్పి రావడంతో బాధ భరించలేక తన మామిడి తోటలో మామిడి చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య హేమావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Posted Under AP
Editor