తాడిమర్రి (yes9tv )ఎస్సీ కాలనీలో నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం – పుష్కలంగా నీరు అందించిన కొత్త బోరు
శ్రీ సత్యసాయి జిల్లా పిన్నదరి గ్రామ పంచాయతీ పరిధిలోని పిన్నదరి గ్రామ ఎస్సీ కాలనీలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు గ్రామ పంచాయతీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపించారు. గ్రామ పంచాయతీ నిధులతో ఎస్సీ కాలనీ సమీపంలో కొత్త బోరును ఏర్పాటు చేయగా, బోరులో సమృద్ధిగా నీరు లభించడం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది.
కొత్తగా ఏర్పాటు చేసిన బోరు ద్వారా పైప్‌లైన్ సౌకర్యం కల్పించి ఎస్సీ కాలనీలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసే ఏర్పాట్లు చేపట్టారు. దీంతో ఎన్నో రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపశమనం లభించింది.
గ్రామాభివృద్ధి, ప్రజల మౌలిక అవసరాల కల్పనలో భాగంగా అధికారులు తీసుకున్న ఈ చర్యపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ బోరు గ్రామ ప్రజలకు వరంగా మారిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీడీఓ రంగారావు గారు, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓ విజయశేఖర్ నాయుడు గారు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఫమీద పర్వీన్ గారు, పంచాయతీ కార్యదర్శి పరమేశ్వర్ గారు పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులు బి. విశ్వనాథ్, కేశవనారాయణ, రమణ, టి. సదయ్య, తిరుపాలు, శ్రీను, కిరణ్, రాజశేఖర్, హరీష్, శేఖర్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు – ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం” అనే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంది.
తాడిమర్రి ఎస్సీ కాలనీ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం.. కొత్త బోరుతో పుష్కలంగా తాగునీరు
