బీజేపీ కుటుంబంలోకి యువతకు ఘన స్వాగతం
ముదిగుబ్బ yes9tv
నేడు ముదిగుబ్బ మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి గౌరవ శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, పుట్టపర్తి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ జి.ఎం. శేఖర్ గారి మార్గదర్శకత్వంలో, ముదిగుబ్బ మండల ఎంపీపీ శ్రీ ఆదినారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.
ముదిగుబ్బ మండలానికి చెందిన యువత నిధికుమార్ , హర్షరెడ్డి , అజయ్ కుమార్, నందకుమార్, శివానంద, జగదీశ్, ప్రవీణ్ కుమార్, ప్రణవ్ కుమార్, సంతోష్, ఫిలిప్, సంతోష్ మొదలైన యువకులను పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి బీజేపీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు. యువత పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు.
అలాగే, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దేశ నిర్మాణంలో పార్టీ పోషిస్తున్న పాత్ర పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం హర్షణీయమని నాయకులు తెలిపారు.
