అనంతపురం జిల్లా..
అనంతపురం జిల్లా,రాయదుర్గం.
- అట్టహాసంగా మహానాడు వేడుకలు
- వర్చువల్ విధానంలో మహానాడు సంబరాలు
- 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు వీక్షించేందుకు ఏర్పాట్లు ముఖ్యఅతిథిగా అంబికా లక్ష్మీనారాయణ
డిజిటల్ వేదికగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. టిడిపి నాయకులు కార్యకర్తలు వీక్షించేందుకు ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న మహానాడు వేడుకలను 10 క్లస్టర్లలో టిడిపి నాయకులు కార్యకర్తలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. డి. హిరేహాల్ మండలంలో ఇర్దేహళ్ గ్రామంలో ముఖ్యఅతిథిగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కుమారుడు కాలవ భరత్ పాల్గొన్నారు. పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయం, సీతారామాంజనేయ స్వామి కళ్యాణమండపం, రాయదుర్గం మండలం పల్లెపల్లి వడ్రేవన్నూరు గ్రామాల్లో, డి.హిరేహళ్ మండలం హిర్దేహళ్ ఆంజనేయ స్వామి కళ్యాణమండపం, కనేకల్ మండల కేంద్రంలోని శ్రీ చిక్కణేశ్వర స్వామీ కళ్యాణ మండపం, మాల్యం గ్రామంలో, బొమ్మనహళ్ మండలం దర్గా హోన్నూరు, గుమ్మగట్ట మండలం 75 .వీరాపురం గ్రామాల్లో వర్చువల్ విధానంలో మహానాడు వేడుకలు తిలకించే విధంగా ఏర్పాట్లు నిర్వహించారు.టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.
బైట్స్. అంబిక లక్ష్మీనారాయణ అనంతపురం పార్లమెంట్ సభ్యులు
