నేడు మన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు PVN మాధవ్ గారి పిలుపు మేరకు మరియు మన రాష్ట్ర వైద్య,విద్య,ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ అన్నగారి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ జి ఎం శేఖర్ గారి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ముదిగుబ్బ మండలంలోని కొడవండ్లపల్లి గ్రామంలో “మన ఊరు – మన జెండా”కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ బిజెపి 75 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనను, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటిపై బీజేపీ జెండాను ఆవిష్కరించడం.ప్రధాని మోదీ సుపరిపాలనలో కేంద్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడం.ఈ కార్యక్రమం ద్వారా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం మరియు దేశభక్తిని పెంపొందించడం.ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు అనిల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కుళ్లాయప్ప, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగాధర్ రెడ్డి, ఓబిసి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ప్రసాద్, మండల ఓబీసీ అధ్యక్షులు చంద్రమోహన్,ఓబిసి మండల కార్యదర్శి ప్రభాకర్, సర్పంచులు నాగభూషణ,వేణుగోపాల్, లింగమయ్య, జనసేన మండల ఉపాధ్యక్షులు నరేంద్ర, రవీందర్ రెడ్డి, నాగభూషణ,గంగాధర, పెద్ద రాములు, ఆది, ఉత్తప్ప, నారాయణ స్వామి,శ్రీకాంత్, రఘురాముడు, చంద్ర,మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు,అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.
కొడవండ్లపల్లిలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ శ్రేణుల కదంతొక్కుడు
