ఓబులాపురం రైతులను ఆదుకోవాలని తహశీల్దారు కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

ఓబులాపురం రైతులను ఆదుకోవాలని తహశీల్దారు కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా

Biop పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాలి

మా భూములు మాకే ఇవ్వాలి లేని పక్షంలో హైకోర్టు తీర్పు మేరకు ఎకరాకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి

అసైన్ భూములను తీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం తిరిగి రైతులకు ఇవ్వాలని

ఓబులాపురం రైతులకు న్యాయం చేయాలి అని డి.హీరేహాళ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సీపీఐ, ఆధ్వర్యంలో రైతులు ధర్నా..

అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం BIOP పరిశ్రమ ఏర్పాటు పేరుతో భూములు కొనుగోలు ఓబులాపురం రైతులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ మంగళవారం సీపీఐ,మరియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం డి.హీరేహాల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా సీపీఐ కార్యదర్శి నారాయణస్వామి, ఓబులాపురం రైతులు మాట్లాడుతూ.. 2004లో ఏపీఐఐసీ (APIIC) ద్వారా ఎలాంటి భూసేకరణ నోటిఫికేషన్ లేకుండానే BIOP పరిశ్రమ కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. 56 మంది రైతులకు చెందిన దాదాపు 350 ఎకరాల భూములను తీసుకున్న యాజమాన్యం, కేవలం 50 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకుందని అన్నారు.
పక్షపాత ధోరణితో ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఎకరాకు 50 వేల నుండి లక్ష రూపాయలు వరకు డబ్బులు చెల్లించి రైతుల మధ్య వైషమ్యాలు పెంచారని వారు ఆవేదన చెందారు..
రైతులందరికీ సమానంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము డబ్బులు చెల్లించాలని 2014 నుండి పోరాటం చేస్తున్న అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తూ బాధిత రైతులకు న్యాయమైన పరిహారం ఎకరాకు రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి లేదా వారి భూములను వారికే తిరిగి ఇచ్చేయాలి.
ఫ్యాక్టరీ యాజమాన్యం అక్రమంగా స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూములను వెంటనే రైతులకు అప్పగించాలి …
ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా ఓబులాపురం గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు , దీనిపై తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.
ఇప్పటికీ చాలా భూములు రైతుల పేర్లే ఉన్నాయని వాటిని స్వాధీనానికి ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం, స్థానిక అధికారులు స్పందించి తమకు పూర్తి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

బైట్స్: 1) నారాయణస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి.
2) సిద్ధమ్మ, మహిళా రైతు ఓబులాపురం.
3) ఓబులాపురం రైతు.
4) బసవరాజు ఓబులాపురం గ్రామ రైతు.
5) సిద్ధమూర్తి రైతు ఓబులాపురం గ్రామం.

Posted Under AP
Editor