Latest Posts

ఏ బి పల్లి తండా లో – నీటి ఎద్దడికి చెక్…

ఏ బి పల్లి తండా లో – నీటి ఎద్దడికి చెక్…
ముదిగుబ్బ yes9tv
ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం అడివిబ్రాహ్మణపల్లి తండాలో నెలలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని గుర్తించిన వైద్య విద్య శాఖ మంత్రి గౌరవ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని నూతన బోర్ ఏర్పాటు చేయించారు.
బోర్‌లో సమృద్ధిగా నీరు రావడంతో గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు ఇప్పుడు ఉపశమనం లభించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతులు అందించడం తమ బాధ్యత అని, గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపాలమ్మ, సర్పంచ్ నాగభూషణ్, ఓబీసీ మండల అధ్యక్షుడు చంద్రమోహన్, దేవుడు నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor