నల్లమాడలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై సతీష్ కుమార్..

నల్లమాడలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై సతీష్ కుమార్
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేర
సత్య సాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రమైన జడ్పీహెచ్ఎస్ స్కూల్లో శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే మండల కన్వీనర్ మైలే శంకర బుట్టి నాగభూషణం నాయుడు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరము నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఐ సతీష్ కుమార్ విచ్చేసి రిబ్బన్ కట్ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఉచిత మెగా వైద్య శిబిరానికి 155 మంది రోగులు రావడం జరిగింది వారికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత రక్త పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడమైనది. పదిమంది శాస్త్రచికిత్స కోసం రమాదేవి హాస్పిటల్ వారు సొంత వాహనాలలో తిరుపతికి తరలించి వారికి ఉచిత భోజనము రవాణా ఖర్చులు హాస్పిటల్ బృందం చెల్లిస్తుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి రోగులకు విశ్రాంతి ఉపాధ్యాయుడు లక్ష్మన్న గారు వాటర్ బాటిళ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు,

Posted Under AP
Editor