అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం.
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ శుభ్రంగా ఉండాలంటే కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు స్వచ్ఛత కోసం సహకరించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పురపాలక శాఖ వారు చెప్పిన విధంగా చెత్తను వేరు చేసి కార్మికులకు సహకరించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.
పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వాల్మీకి కూడలిలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్కక్రమం ప్రారంభానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని తానే స్వయంగా చీపురు పట్టి కార్మికులతో కలసి రోడ్డును శుభ్రం చేశారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి పట్టణం సుందరంగా ఉంచాలంటే పట్టణంలో నివసించే ప్రతి వ్యక్తి శుభ్రతను బాధ్యతగా తీసుకుని మున్సిపల్ కార్మికులకు సహకరించాలని అన్నారు..ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంప్ యార్డు క్లీనింగ్ పనులు పూర్తయినా అందులో మిగిలిన ప్లాస్టిక్ ఇతర వ్యర్తాలను తొలగించకుండా ఆగిపోయాయని ఇందుకు కారణం అందులో ఉన్న వ్యర్తాలను విడదీయకపోవడమే కారణమని అది పూర్తయితే ఆ స్థలం ప్రజలకు ఉపయోగంలోకి వచ్చేదన్నారు.ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నీటి నుంచి జూన్ 20 తేదీ వరకు కొనసాగుతుందని మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి శుభ్రత గురించి, చెత్తను వేరుచేయడం గురించి ఏ డబ్బాలోకి ఏ చెత్త వేయాలని అవగాహన కల్పిస్తారని ప్రజలు కూడా వారికి సహకరించాలని తెలిపారు..
