రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి..

అనంతపురం జిల్లా

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి

– : ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న 32 రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకోసం రూ.6.33 కోట్ల రూపాయల నిధులు మంజూరు

– : ప్రత్యేక జీవో (జీవో ఆర్టీ నంబర్. 452) విడుదల

అనంతపురం, మే 26 :

– రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొద్దిరోజుల కిందట గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవన నిర్మాణాలకు నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరగగా, తాజాగా ఈరోజు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి చేయడంతో ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకోసం రూ.6.33 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ మంగళవారం ప్రత్యేక జీవో విడుదల కావడం జరిగింది. వ్యవసాయ మరియు సహకార శాఖ బడ్జెట్ అంచనాలు మేరకు 2026-27 లో రైతు సేవ కేంద్రాలకి రూ. 6.33 కోట్ల (ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు) నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల చేస్తూ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులను జారీ చేశారు.

– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న 32 రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం కోసం నిధులను విడుదల చేయాలని కోరడం జరగగా, జీవో ఆర్టీ నంబర్ 452 ను ఉరవకొండ నియోజకవర్గంలోని 32 రైతు సేవ కేంద్రాల భవనాల పనులను పూర్తి చేయడానికి రూ.6.33 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఈరోజు (26.05.2026) జీవోను విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న సచివాలయ, రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం వేగవంతంగా కొనసాగనుంది.

Posted Under AP
Editor