Latest Posts

నెల రోజుల యాక్షన్ ప్లాన్ తో నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తాం…

అనంతపురం జిల్లా, టౌన్.

నెల రోజుల యాక్షన్ ప్లాన్ తో నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తాం

– : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వెల్లడి

– : ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

– : పక్కా ప్రణాళికతో చెత్త సేకరణ, పరిశుభ్రతా చర్యలు

– : ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ విజ్ఞప్తి

– నెల రోజుల యాక్షన్ ప్లాన్ తో అనంతపురం నగరాన్ని పరిశుభ్రంగా మార్చబోతున్నామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని సూర్య నగర్ రోడ్డు, ఐదవ సర్కిల్ మస్టర్ పాయింట్, గుత్తి రోడ్డు బస్ స్టాప్ వద్ద ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బహిరంగ మూత్ర విసర్జన ప్రాంతాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి, కలెక్టర్ ఆనంద్ స్వయంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. అనంతరం నగరంలో పరిశుభ్రతా చర్యలపై చేపట్టిన యాక్షన్ ప్లాన్ ను పరిశీలించారు.

– ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. 30 రోజుల పాటు, 4 వారాల ప్రత్యేక ప్రణాళికతో రోడ్లు, డ్రైన్లు, మార్కెట్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ చేపట్టారని.. ఇక నుంచి ఏ ప్రాంతంలో ఎన్ని గంటలకు, ఎవరు చెత్త తీసుకెళ్లేందుకు వస్తారన్న వివరాలు ప్రజలకు ముందే చెబుతామన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి..ఆ సమయంలోనే చెత్త అందించేలా ప్రణాళిక చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక నాయకులు కూడా పాల్గొంటారన్నారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారన్నది సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. ఏ రోజు కూడా నగరంలో పరిశుభ్రతా చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక అధికారిగా వచ్చిన మూడు నెలల్లో నగరంలో చాలా మార్పు కనిపిస్తోందన్నారు. రానున్న నెల రోజుల యాక్షన్ ప్లాన్ తో నగరంలో మరింత మార్పు చూస్తారని ఎమ్మెల్యే అన్నారు.

– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా నగర పరిశుభ్రత విషయంలో కొంత వరకు మార్పు వచ్చిందని.. అయితే పూర్తి స్థాయిలో నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక చేసినట్టు చెప్పారు. జిల్లాలో అన్ని మున్సిపాల్టీల్లో దీనిని అమలు చేయబోతున్నామన్నారు. ప్రతి కాలనీకి ఏ సమయానికి చెత్త సేకరణ జరుగుతుందన్నది ముందే చెబుతామన్నారు. చెత్త సేకరణకు వచ్చే సిబ్బంది పేరు, సచివాలయ సెక్రటరీ, శానిటరీ ఇన్సిపెక్టర్ వివరాలు కూడా ఉండే విధంగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. జీఐఎస్ మ్యాప్ లు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూం కూడా పని చేస్తుందన్నారు. చెత్త తరలించే వాహనం వచ్చిన సమయంలోనే వారికి చెత్త ఇచ్చేలా ప్రజలు సహకరించాలన్నారు. ఎవరైనా చెత్త సేకరణకు రాకపోతే.. సెక్రటరీ లేదా శానిటరీ ఇన్సిపెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వారు కూడా స్పందించకపోతే కంట్రోల్ రూంకి ఫిర్యాదు చేయాలన్నారు. ఏదైనా ప్రజలు సహకరిస్తేనే నగరంలో పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. ఓ వైపు పరిశుభ్రతా చర్యలు చేపట్టడంతో పాటు ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

– ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్, స్వచ్చంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్ తో పాటు ఆశాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor