Latest Posts

రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…..

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

– : రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

– : ఇసుక విధానం, క్వారీ నిధుల విషయంలో సమస్యలను పరిష్కరించి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి

– : ఎన్.డి.పి.ఎల్ నేరాలను పూర్తిగా నియంత్రించడంతో పాటు, ఐడి నేరాలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి

– : రాష్ట్ర ఎక్సైజ్, గనులు & జియాలజీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర

– అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా గనులు మరియు ఎక్సైజ్ శాఖ అధికారులతో వేరువేరుగా రాష్ట్ర ఎక్సైజ్, గనులు & జియాలజీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు, డిఆర్ఓ ఏ.మాలోల, తదితరులు పాల్గొన్నారు.

– అనంతరం జిల్లా ఎక్సైజ్ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలలో నమోదవుతున్న ఆదాయ వృద్ధి, నేరాల గుర్తింపు, అలాగే మద్యం దుకాణాలు మరియు బార్లలో జరుగుతున్న ఉల్లంఘనలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్.డి.పి.ఎల్ నేరాలను పూర్తిగా నియంత్రించడంతో పాటు, ఐడి నేరాలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మద్యం దుకాణాలు మరియు బార్లలో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

– తదనంతరం అక్కడే అర్బన్ ఎమ్మెల్యే, ఆర్టీసీ జోనల్ చైర్మన్ లతో కలిసి మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఉచిత ఇసుక విషయంలో మైనింగ్ అధికారులు పకడ్బందీగా ఉండాలనీ మైనింగ్ అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. నాటు సారా, మద్యం అక్రమ రవాణా, షాపుల టైమింగ్స్, MRP విషయంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో మైన్స్ మరియు ఎక్సైజ్ శాఖను బ్రష్టు పట్టించారనీ, ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తోందనీ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల సౌకర్యార్థం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉచిత ఇసుక పాలసీ అమలుతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజలకు నామ మాత్రము రుసుముతో అందిస్తున్నామని తెలిపారు. 3 లక్షల టన్నులు ఇసుకను అనంతపురము జిల్లాలోని ప్రజలకు అందించామనీ, దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రజలకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామనీ అన్నారు. అక్రమాలకు తావులేకుండా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. డిసిల్టేషన్ పాయింట్లను, రీచ్ లను ఓపెన్ చేయడం జరిగిందనీ, గత ప్రభుత్వంలో వేధింపులు ఉన్నాయనీ, ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది అని అన్నారు. జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రవేట్ ఏజెన్సీ ద్వారా తవ్వి తీసే కార్యక్రమం జరుగుతోందనీ, అలాగే మన జిల్లాలో రామగిరి ప్రాంతంలో కూడా కొత్త గనుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామనీ తెలిపారు. అనంతపురం జిల్లాలోని కలర్ గ్రానైట్ సమస్యలను పరిష్కరించి, కర్ణాటకతో ఉన్న రాయల్టీ వివాదాలను సర్దుబాటు చేస్తామనీ అన్నారు.మన ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ సంబంధిత గొప్ప నిల్వలు ఉన్నాయనీ, ఒడిశా తర్వాత అత్యధిక ఐరన్ ఓర్ సామర్థ్యం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. నెల్లూరు మరియు ఇతర ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్‌కు అవసరమైన క్వార్ట్జ్ నిక్షేపాలను గుర్తించామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నంలో రెండు రేర్ ఎర్త్ మినరల్స్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ అధ్వాన్నంగా వారు చెప్పిన బ్రాండ్ లను మాత్రమే పెట్టీ అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేశారనీ అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులో పెట్టి ప్రజలకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచామని అన్నారు. ఎక్సైజ్ ఆదాయం దళారులు దోచుకునే విధంగా గతంలో ఉండేది. కానీ నేడు ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం మద్యం వ్యాపారంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మల్టీ నేషనల్ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చామనీ అన్నారు. మద్యం నాణ్యతను పరీక్షించడానికి ఐదు ప్రాంతాలలో అత్యాధునిక లాబొరేటరీలను ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి మరియు రాజకీయ అంశాలు రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ అన్నారు. మన రాష్ట్రానికి ప్రభుత్వంపై నమ్మకంతో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయనీ, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కియా మోటార్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థల తరహాలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు. పదవీ కాంక్షతో బురద చల్లే మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడనీ తెలిపారు. ఈ మధ్యనే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో రక్షణ రంగంలో పెద్ద ప్రాజెక్ట్ సత్యసాయి జిల్లాలో శ్రీకారం చుట్టారనీ అన్నారు. అమరావతి రైతులు మన రాజధానికి మరింత భూములు అందిస్తామని ముందుకు వస్తుంటే వారిని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారనీ ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను గమనించాలనీ అన్నారు.

Posted Under AP
Editor