ఉరవకొండ విద్యా శాఖ కార్యాలయంలో ఈరోజు ( USFI, PSF )విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో “కార్పొరేట్ బడులు వద్దు – ప్రభుత్వ బడులే ముద్దు” పోస్టర్‌ను M.E.O గారి చేతుల మీదగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఉరవకొండ విద్యా శాఖా అధికారి ఈశ్వరప్ప గారు USFI జిల్లా కార్యదర్శి భీమేష్, PSF జిల్లా ఉపాధ్యక్షులు హిరణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ…. మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్యను అందించడం, మన ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకోవడం అందరి ప్రాథమిక బాధ్యత.” ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు లభించే అద్భుతమైన ప్రయోజనాలను ఉంటాయని వారు తెలిపారు.అదేవిధంగా నేటి సమాజంలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను కేవలం ఒక వ్యాపారంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ బడుల్లో ఎలాంటి ఫీజులు లేకుండా అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందుతుంది.అదే కార్పొరేట్ బడుల్లో అడ్మిషన్, ట్యూషన్, యూనిఫాం, బుక్స్ పేరుతో తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నారు.చదువుతో పాటు ఆటలు, కళలు,సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వ బడులు ప్రాధాన్యతనిస్తాయి.కార్పొరేట్ బడుల్లో కేవలం మార్కులు, ర్యాంకులు, హోంవర్క్‌ల పేరిట విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. విద్యా హక్కు చట్టం మన ఆయుధం- ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడుకోవడం మన కర్తవ్యం” అని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కార్పొరేట్ మాయలో పడి అప్పులపాలు కాకుండా, సకల వసతులు మరియు నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో నాయకులు మంజు నాయక్, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.
