తాడిమర్రి మండల కాపునాడు అధ్యక్షునిగా కాడిశెట్టి ఇంద్ర కుమార్ నియామకం

తాడిమర్రి( yes9tv )కాపునాడు తాడిమర్రి మండల అధ్యక్షునిగా కాడిశెట్టి ఇంద్ర కుమార్ నియామకం
తాడిమర్రి మండల కాపునాడు అధ్యక్షునిగా కాడిశెట్టి ఇంద్ర కుమార్‌ను నియమిస్తూ కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఇటికింటి మహేష్ మరియు కాపునాడు రాయలసీమ అధ్యక్షులు పూల పాండురంగయ్య అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు కాడిశెట్టి ఇంద్ర కుమార్ మాట్లాడుతూ బలిజ సామాజిక వర్గ అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బలిజలకు అధిక రాజకీయ ప్రాధాన్యం, ఎక్కువ సీట్లు దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. బలిజ యువత రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి కాపునాడు వేదికగా పనిచేస్తామని పేర్కొన్నారు.
అలాగే మహానేత శ్రీకృష్ణదేవరాయలు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థుల విద్యాభివృద్ధికి సహాయం అందిస్తూ, అవసరమైన చోట విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
బలిజల ఐక్యత, సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, యువతకు శిక్షణ కార్యక్రమాలు, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కాపునాడు సంస్థను బలోపేతం చేస్తూ ప్రతి కుటుంబానికి చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
తన నియామకానికి సహకరించిన తాడిమర్రి మండల బలిజ బాంధవులకు, కాపునాడు నాయకులకు, పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపునాడు నాయకులు, యువకులు, బలిజ సంఘ సభ్యులు పాల్గొని కాడిశెట్టి ఇంద్ర కుమార్‌కు అభినందనలు

Posted Under AP
Editor