అనంతపురం జిల్లా,రాయదుర్గం.
రాయదుర్గం పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రభాకర్ విద్యుత్ ప్రమాదంలో గాయపడి గత ఎనిమిది నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. ఉరవకొండ ప్రాంతంలో ఎలక్ట్రికల్ పనులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన పారాలైజ్కు గురై నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణను భార్య కూలి పనులకు వెళ్లి నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి బాధితుడు ప్రభాకర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్, వైద్య శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వ సహాయం అందించేలా కృషి చేస్తానన్నారు.
ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్ ఇప్పటివరకు ఎటువంటి సహాయం చేయలేదని, పలుమార్లు అడిగినా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ద్వారా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీవి నాయుడు (నాని), హరిత, డాక్టర్ శివ రుద్రయ్య, బండి భీమసేన, కసందుల నాగరాజు, డాక్టర్ మల్లికార్జున, వాల్మీకి పవన్ కుమార్, వేణుగోపాల్, మారన్న, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, రూరల్ మండల అధ్యక్షుడు నాగరాజు, మహిళ కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
