తాడిమర్రి (yes9tv )తాడిమర్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ సమావేశం
స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా తాడిమర్రి మనోజ్ కుమార్ రెడ్డి నియామకం – నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం
గౌరవ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారి కుమారుడు తాడిమర్రి మనోజ్ కుమార్ రెడ్డి గారిని స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా నియమించిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కీర్తిశేషులు గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
మనోజ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు
పార్టీ బలోపేతంపై నాయకుల చర్చ
యువతకు పార్టీ లో మరిన్ని అవకాశాలపై సందేశం
వైఎస్సార్ ఆశయాల సాధనకు కట్టుబాటు
భారీగా కార్యకర్తల సమీకరణ
తేదీ: 20-05-2026సమయం: సాయంత్రం 4 గంటలకు
స్థలం: తాడిమర్రి మండల కేంద్రం, గౌరవ SEC సభ్యులు తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసం వద్ద
అందువల్ల ప్రతి ఒక్క వైఎస్సార్‌సీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పేరుపేరునా కోరారు.
తాడిమర్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ సమావేశం….
