Latest Posts

కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యం. – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

 

డి. హీరేహాల్

నవంబర్ 2
YES 9 TV News

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. వైకాపా అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉందని, ఆ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధక శక్తులుగా మారుతారని విమర్శించారు. డి హీరేహాల్ మండలం పూలకుర్తి, జాజరకల్లు, మడేనహళ్లి, ఓబుళాపురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి రూ.65 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఈ రెండేళ్లలో రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.1,350 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. సామాజిక భద్రతా పింఛన్లను భారీగా పెంచి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా సామర్థ్యం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, మంత్రి నారా లోకేష్ వేగవంతమైన కార్యాచరణ రాష్ట్ర అభివృద్ధికి బలంగా నిలుస్తున్నాయన్నారు. అందరి సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందిన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇలాంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి బలపరిచిన జడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి బోయ వన్నూరుస్వామి కమలం గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటు లో ఉంటూ గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పరిశీలాకులు గుర్రప్ప, మండల పార్టీ అధ్యక్షుడు తలారి గంగాధర్, కాదలూరు మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లీ రాజు, జెడ్పిటిసి అభ్యర్థి వన్నూరుస్వామి,తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor